About Me

రివ్యూ : ఆఫీసర్

రివ్యూ : ఆఫీసర్Nagarjuna Officer Review


రివ్యూ: ఆఫీసర్
రేటింగ్‌: 1.5/5
తారాగణం: నాగార్జున, మైరా సరీన్, షియాజీ షిండే తదితరులు
సంగీతం: రవి శంకర్
నిర్మాత:  ఆర్‌ కంపెనీ
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ

అనగనగా ఒక దర్శకుడు. సినిమా గమనాన్ని మార్చి కొత్త నడకలు నేర్పాడు. అతన్ని ఆదర్శంగా తీసుకుని ఎందరో యువతరం దర్శకులు తమ టాలెంట్ తో ఇండస్ట్రీ లో స్థిరపడ్డారు. అప్పట్లో ఆయన తీసిన సినిమాలు ఇప్పటికీ రిఫరెన్స్ గా వాడుకుంటూనే ఉంటారు. అదంతా గతం. ఇప్పుడు అతని పేరు చెబితేనే భయపడే పరిస్థితి.

ఎవరి గురించో మీరు మొదటి లైన్ లోనే గెస్ చేసుంటారు కాబట్టి స్ట్రెయిట్ గా పాయింట్ కు వచ్చేద్దాం. వర్మ అనే బ్రాండ్ ఇన్నేళ్ల పాటు నిలవడం అంటే శివ తాలూకు ప్రభావం ఇంకా పరిశ్రమ మీద సజీవంగా ఉండటమే. అలాంటి కాంబోలో ఇన్నేళ్ల తర్వాత సినిమా వస్తుంది అంటే ఎంతో కొంత ఆశించడం సహజం. అలా వచ్చిందే ఆఫీసర్. హైప్ లేకుండా తక్కువ థియేటర్లలో విడుదలైంది ఈ సినిమా.

కథ విషయానికి వస్తే ముంబైలో ఉండే ఒక రౌడీ పోలీసు నారాయణ్ పసారి. అతను చేసే దుర్మార్గాల గురించి విచారించడానికి వస్తాడు శివాజీ రావు(నాగార్జున). ఆధారాలతో అరెస్ట్ కూడా చేస్తాడు. కానీ సాక్షిని చంపించి పసారి బయటకి వస్తాడు. ఆహా అనుకున్న ప్రభుత్వం ముంబైని అంతం చేసే స్పెషల్ టీమ్ కి పసారినే హెడ్ గా పెట్టి శివాజీని అసిస్టెంట్ గా వేస్తారు.

పసారి సైలెంట్ గా రివెంజ్ కు దిగుతాడు. శివాజీ టీమ్ లో ఒక్కొక్కరిని చంపుతాడు. శివాజీనే డాన్ అని ప్రపంచానికి చూపిస్తాడు. ఈ ఛాలెంజ్ ని శివాజీ ఎలా ఫేస్ చేసాడు అనేదే వర్మ విరచించిన అద్భుత కథ.

నాగార్జున వర్మను ఓసారి నమ్మడంలో తప్పు లేదు. అంతం, గోవిందా గోవిందా రెండు డిజాస్టర్లు ఇచ్చి పాతికేళ్ళు దాటింది కాబట్టి ఏమైనా మారుంటాడు అనే నమ్మకంతో ఆఫర్ ఇచ్చాడు. తన తప్పు లేకుండా నటించాడు కూడా. ఒక్క ఇంచు నవ్వు చూపకుండా చాలా సీరియస్ గా ఉండే శివాజీ పాత్రలో నాగ్ బెస్ట్ ఇచ్చాడు.

హీరోయిన్ మైరా సరీన్ ఓవర్ యాక్షన్ చూడడానికి రెండు కళ్ళు చాలవు. గ్లామర్ పరంగా అనవసరంగా ఎక్స్ పోజ్ చేయించిన వర్మ ఓ పాట పెట్టినా సరిపోయేది. విలన్ చేసింది ఏమి లేకపోయినా డబ్బింగ్ తో కవర్ చేసేసారు. షియాజీ షిండే కామెడీ చేయబోయి నవ్వుల పాలు కాగా…. అజయ్ ఏం చేయాలో అర్థం కాక సింగల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చి మేనేజ్ చేసాడు. ఇంత కన్నా నటీనటులు ఇందులో ఎవరూ లేరు.

వర్మ మీద నమ్మకంతో కాదు కానీ ఏదో నాగార్జున చెప్పాడు కదా అని ఆఫీసర్ కు వెళ్తే అర్థం లేని ఛేజులు, ఫైట్లతో సహనానికి పరీక్ష పెట్టాడు వర్మ. ఒక నోటోరియస్ క్రిమినల్ పోలీస్ ఆఫీసర్, ఒక సిన్సియర్ ఆఫీసర్ మధ్య యుద్ధం అనే పాయింట్ లో చాలా కొత్తదనం ఉంది. దాన్ని ప్రతిభావంతంగా ఉపయోగించుకోలేక చతికిలబడ్డాడు వర్మ. అరిగిపోయిన ఫార్ములా మాఫియా ఎపిసోడ్స్ తో ఎంతకీ సాగని కథనంతో రెండు గంటల సినిమాని మూడు గంటలు చూస్తున్నామా అనే ఫీలింగ్ వచ్చేలా చేసాడు .

హీరోయిన్ చివరి దాకా గుడ్డిగా విలన్ ని నమ్మడం, ఇంత జరుగుతున్నా ఇదేదో అంతర్గత వ్యవహారంలా…. ప్రభుత్వం లేదు అనేలా రాసుకోవడం లాజిక్ కి దూరంగానే కాదు సిల్లీగా కూడా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో విలన్ ని ఆడుకుంటే… సెకండ్ హాఫ్ లో విలన్ హీరోని జోకర్ ని చేస్తాడు. అంతకు మించి ఏమి లేని ఈ కథతో నాగ్ ని ఒప్పించిన వర్మ తెలివికి హాట్స్ ఆఫ్ చెప్పాలి.

అర్థం లేని కెమెరా యాంగిల్స్ తో టాప్ బాటమ్ అంటూ…. ఎక్కడెక్కడ చూపించాడో…. ఏం చూపించాడో…. వర్మకైనా అర్థమైతే గొప్పే. రవి శంకర్ సంగీతం కాపీ క్యాట్ లా ఉంది తప్ప…. సౌండ్ సౌండ్ అంటూ టీజర్ లో ఊదరగొట్టినంత మ్యాటర్ లేదు. రాహుల్ టీమ్ కెమెరా కొన్నిసార్లు మెప్పిస్తే కొని సార్లు శృతి తప్పింది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం జస్ట్ ఓకే అనిపించాయి. నిర్మాణం గురించి మాట్లాడ్డానికి ఏమీ లేదు.

ఆఫీసర్ వర్మ స్టైల్ లో తీసిన అరిగిపోయిన ఒక పాత ఫార్ములా కథ. ఎటువంటి ప్రత్యేకత లేకుండా తనను నమ్ముకుని వస్తే ఎంతటి స్టార్ హీరోకైనా పరాభవం తప్పదు అని నిరూపించేలా తీసిన ఒక కళాఖండం.

ప్రీ రిలీజ్ లో నాగ్ చెప్పిన మాట ప్రకారం నిలబడితే కనక వర్మకు తన్నులు తప్పవు. కథ లేకుండా ఏదో స్క్రీన్ ప్లే తో సాగదీద్దాం అని వర్మ చేసిన ప్రయత్నం అసలుకే మోసం తెచ్చింది. ఇంత కన్నా చెప్పడానికి ఆఫీసర్ లో ఏమీ లేదు.

ఆఫీసర్ : డ్యూటీ లో ఫెయిల్ అయ్యాడు

Post a Comment

0 Comments