మొదటిసారి త్రిష ఆ పనికి ఒప్పుకుంది...?
దక్షిణాది స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిష ప్రస్తుతం కమర్షియల్ సినిమాల్ని తగ్గించేసి ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఆమె చేసిన సినిమానే 'మోహిని'. ఈ చిత్రం కోసం త్రిష తన కెరీర్లోనే ఎన్నడూ చేయని ఒక పనిని చేశారు.
అదేమిటంటే ఈ సినిమాలో ఆమె రెండు పాత్రల్లో కనిపించనున్నారు. త్రిష ఇలా డ్యూయల్ రోల్ చేయడం ఇదే మొదటిసారి. అందుకే అందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నన్న ఈ సినిమాను ఆర్.మాదేష్ డైరెక్ట్ చేశారు. విజువల్ ట్రీట్ గా ఉండబోతున్న ఈ సినిమా జూలై 27న విడుదలకానుంది.
0 Comments